Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లండన్ లో ఉగ్రదాడి!... కత్తి చేతబట్టి ముష్కరుడి వీరంగం, మహిళ దుర్మరణం

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. వివిధ దేశాల్లోని ప్రధాన నగరాల్లోకి ఎంటరవుతున్న ఉగ్రవాదులు యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బ్రిటన్ రాజధాని లండన్ లో ఓ ఉగ్రవాది కత్తి చేతబట్టి వీరంగమాడాడు. ఊహించని విధంగా వీధుల్లోకి వచ్చిన అతడు కనిపించిన వారిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. మరింత మందిని గాయపరిచేలోగానే ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News