Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుత్వం భేషజాలకు పోకుండా 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి: డీకే అరుణ

జీవో 123ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్ నేత డీకే అరుణ అభివర్ణించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు మల్లన్నసాగర్ రైతుల విజయమని అన్నారు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలు విడనాడి, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా ప్రభుత్వం చూడాలని ఆమె హితవు పలికారు. హేతుబద్ధమైన భూసేకరణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

More Telugu News