సికింద్రాబాద్లో నకిలీ పోలీసుల హల్చల్.. రూ.7.5 లక్షలు కాజేసిన వైనం
సికింద్రాబాద్లో నకిలీ పోలీసుల వేషంలో ఓ ముఠా హల్చల్ చేసింది. ఆ ప్రాంతాల్లో పలు దుకాణాల్లో సోదాలు చేస్తున్నట్లు నటించిన ముఠా.. తాము పోలీసులమంటూ చెప్పుకుంటూ ఓ బంగారం వ్యాపారి నుంచి రూ.7.5 లక్షలు కాజేసింది. బాధిత వ్యాపారి గోపీనాథ్ కొద్ది సేపటి క్రితం మహంకాళి పోలీసులకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితుల కోసం సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.