హీరోయిన్లందరూ తనకంటే పొడుగని వాపోతున్న బాలీవుడ్ బాద్షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్లందరూ తనకంటే పొడుగని వాపోతున్న బాలీవుడ్ బాద్షా

షారూఖ్ ఖాన్.. బాలీవుడ్ హీరోల్లో పొట్టివాడైనా మహ గట్టివాడు! ఆయన సినిమాల సక్సెస్ రేట్ చూస్తే ఆ విషయం నిజమే అనిపిస్తుంది. ప్రయోగాల జోలికి వెళ్ళకపోయినా, అభిమానులకు కావలిసిందేమిటో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, తన సినిమాల్లో ఆ అంశాలు ఉండేట్టు చూసుకుంటాడీ బాద్షా. అందరూ సిక్స్ ప్యాక్ అంటుంటే.. అదీ సాధించేశాడు, ఓవర్సీస్ మార్కెట్ పై తోటి హీరోలు గురిపెడితే.. తాను వారికంటే ఓ బాణం ఎక్కువే వేశాడు! అదీ, షారూఖ్ వర్కింగ్ స్టయిల్. ఇంతటి కథానాయకుడు సైతం తన ఎత్తు గురించి వాపోతున్నాడు.

ప్రస్తుతం షారూఖ్ చెన్నై ఎక్స్ ప్రెస్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కేరళలో ఈ చిత్రం తాజా షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. షూటింగ్ గ్యాప్ లో ఈ బాలీవుడ్ బాద్షా విలేకరులతో పిచ్చాపాటీకి దిగాడు. తన హీరోయిన్లు తనకంటే పొడవున్నారంటున్నాడు. అందుకే టైటిల్స్ లో తన పేరుకన్నా వారిపేర్లే ముందొస్తాయని చమత్కరించాడు. అయితే, అదేమీ మహిళాలోకాన్ని ఉద్ధరించడానికి తీసుకున్న నిర్ణయం కాదట. అదో నమ్మకం అంటూ.. టైటిల్స్ ముందు హీరోయిన్ పేరు వేసినంత మాత్రాన ప్రపంచంలో మార్పేమీ రాదని అభిప్రాయపడ్డాడు.

More Telugu News