మేకను కాపాడబోయి ముగ్గురి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేకను కాపాడబోయి ముగ్గురి మృతి

మేకను కాపాడబోయిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కాన్పూర్ జిల్లా ఘతంపూర్ కు చెందిన యాదవ్ అనే వ్యక్తికి చెందిన మేక నేలబావిలో పడిపోయింది. దానిని బయటకు తీసేందుకు యాదవ్ బావమరిది నూతిలోకి దూకేశాడు. అయితే ఎంతకూ అతను బయటకు రాకపోవడంతో యాదవ్, అతని సోదరుడు కూడా దూకారు. ముగ్గురూ ఎంతకూ బయటకు రాకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈత వచ్చిన ముగ్గురూ బయటకు రాలేదని పేర్కోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు, బావిలో విషవాయువులు ఉన్నాయని, వాటి కారణంగా వారు ముగ్గురూ మృతిచెందారని తేల్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

More Telugu News