టీ ఎంసెట్- 2 రద్దు!... కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ ఎంసెట్- 2 రద్దు!... కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కారు!

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ లీకైందన్న విషయాన్ని నిర్ధారించుకున్న మీదట ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ సర్కారు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. విద్యా, వైద్య శాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలతో పాటు జేఎన్టీయూ అధికారులతో భేటీ అయిన కేసీఆర్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్- 2 ను రద్దు చేసిన కేసీఆర్... సాయంత్రం లోగా ఎంసెట్- 3కి సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించాలని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News