లోక్ సభలో వాయిదాల పర్వం!.. ‘హోదా’ నినాదాలతో అరగంటలో రెండో సారి వాయిదా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్ సభలో వాయిదాల పర్వం!.. ‘హోదా’ నినాదాలతో అరగంటలో రెండో సారి వాయిదా!

ఏపీకి ప్రత్యేక హోదా నినాదాలు పార్లమెంటు సమావేశాలను కుదిపేస్తున్నాయి. లోక్ సభ సభ ప్రారంభం కాగానే ప్లకార్డులు చేతబట్టుకుని సభలోకి ప్రవేశించిన టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు కొనసాగించారు. సభలో ప్లకార్డుల ప్రదర్శన సరికాదని స్పీకర్ వారించినా తెలుగు ఎంపీలు వినిపించుకోలేదు. ఈ క్రమంలో తొలుత 15 నిమిషాల పాటు సభను వాయిదా వేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్... తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఏపీ ఎంపీల నిరసనల్లో ఎలాంటి మార్పు లేని నేపథ్యంలో మరోమారు సభను వాయిదా వేశారు.

More Telugu News