కొనసాగుతున్న ‘హోదా’ బంద్!... తిరుపతిలో వైసీపీ నేత భూమన అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొనసాగుతున్న ‘హోదా’ బంద్!... తిరుపతిలో వైసీపీ నేత భూమన అరెస్ట్!

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ఏపీలో నేటి తెల్లవారుజాము నుంచి మొదలైన బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పినా, టీడీపీ ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడం లేదని ఆరోపిస్తూ ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సహా కాంగ్రెస్, వామపక్షాలు నేడు రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు తెల్లవారకముందే రోడ్లపైకి వచ్చిన ఆయా పార్టీల నేతలు ఎక్కడికక్కడ బస్సు డిపోల ముందు బైఠాయించారు. అదే సమయంలో రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో ఆందోళనకు దిగిన వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News