Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా భార్య న్యూడ్ ఫోటోలా?... చాలా కామన్, ఫ్యాషనబుల్: డొనాల్డ్ ట్రంప్

తన సతీమణి మెలానియా నగ్న చిత్రాలను 'న్యూయార్క్ పోస్ట్' ప్రత్యేకంగా సంపాదించి ప్రచురించడంపై అమెరికన్ అధ్యక్ష పదవికి బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆమె ఓ విజయవంతమైన మోడల్ అని, ఇటువంటి ఫోటోలు చాలానే తీయించుకుందని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. ఈ ఫోటోలు తనకు పరిచయం కాకముందు దిగినవని చెప్పిన ఆయన, యూరప్ లో ఇలాంటి ఫోటోలు చాలా సాధారణమైనవని, ఆమె చాలా ఫ్యాషనబుల్ అని అన్నారు. తమకు కాబోయే తొలి మహిళ గతంలో ఇటువంటి ఫోటోలు దిగిందన్న విషయాన్ని జీర్ణించుకునేందుకు అమెరికన్లు కొంత ఇబ్బంది పడుతున్న వేళ, ట్రంప్ ఈ విషయాన్ని చాలా తేలికగానే తీసిపారేశారు. కాగా, ఈ ఫోటోలు తీసిన ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ బస్సేవిల్లే సైతం మీడియా ముందుకు వచ్చి, ఆమె ఎంతో ప్రొఫెషనల్ గా నగ్న దృశ్యాలు తీయించుకుందని చెప్పడం గమనార్హం. ఆ ఫోటో షూట్ లో ఆమె ఎలాంటి ఇబ్బందీ పడలేదని కూడా ఆయన వెల్లడించారు.

More Telugu News