టీడీపీ ఎంపీలంతా ధర్నా చేస్తున్న వేళ కనిపించని కేంద్ర మంత్రులు సుజనా, అశోక్ గజపతి రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ ఎంపీలంతా ధర్నా చేస్తున్న వేళ కనిపించని కేంద్ర మంత్రులు సుజనా, అశోక్ గజపతి రాజు

తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా పార్లమెంటు ఎదుట ప్లకార్డులు, బ్యానర్లూ పట్టుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ధర్నా నిర్వహిస్తున్న వేళ, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు అక్కడ కనిపించలేదు. నిరసన కార్యక్రమం జరుగుతున్న సమయంలో వీరిద్దరూ పార్లమెంటులో ఉన్నప్పటికీ, సహచర ఎంపీల వద్దకు వెళ్లలేదు. కేంద్ర మంత్రుల హోదా ఉన్నందునే వీరిద్దరూ ధర్నాకు రాలేదని తెలుస్తోంది. తొలుత లోక్ సభకు హాజరైన తెలుగుదేశం ఎంపీలు, హోదాపై ప్లకార్డులను చూపి సభా కార్యక్రమాలను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆపై సభ మధ్యాహ్నానికి వాయిదా పడటంతో, బయటకు వచ్చి ధర్నా రూపంలో తమ ఆవేదనను ఎంపీలు వ్యక్తం చేశారు.

More Telugu News