బీడీ కార్మికుల సమస్యలపై లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ జితేందర్‌రెడ్డి
తెలంగాణలోని బీడీ కార్మికులను ఆదుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈరోజు లోక్‌సభలో బీడీ కార్మికుల సమస్యల అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. వారికి ఉపాధి దొరకడం లేదని, వారిలో ఎంతో మంది యువత గల్ఫ్‌కు వలసపోయి కష్టాలు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు. వారికి నిరుద్యోగ భృతి ఇచ్చి, నైపుణ్యాభివృద్ధికి తరగతులు నిర్వహించాలని ఆయన కోరారు. వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తోందని జితేందర్‌రెడ్డి అన్నారు.