Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ చేరుకున్న బాబు

ఏడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ముగించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాబుకు స్వాగతం పలికేందుకు వేలాదిగా కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న బాబు విశాఖలో పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు. అక్కడ పాదయాత్ర విజయస్థూపం ఆవిష్కరించారు. నేటి ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకుని, వేదపండితులు ఆశీస్సులందుకున్నారు.

More Telugu News