: అమెరికా వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్న రజనీకాంత్... సూపర్ స్టార్ సింప్లిసిటీకి మచ్చుతునక!


సినీ పరిశ్రమలో సింప్లిసిటీకి రజనీ కాంత్ ను కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. దీనిని ఆయన పలు సందర్భాల్లో నిరూపించారు కూడా. అయితే ప్రపంచం మొత్తం 'కబాలి' మేనియాలో కొట్టుకుపోతున్న సమయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ అమెరికా వీధుల్లో సింపుల్‌ గా నడుచుకుంటూ వెళ్తుండడాన్ని చూసిన ఓ అభిమాని ఆనందాశ్చర్యాలకు గురై, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. కేవలం 36 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది. తలకు హెడ్ ఫోన్స్ పెట్టుకున్న రజనీకాంత్ పాటలు వింటూ ప్రపంచంతో సంబంధం లేనట్టు వాకింగ్ చేస్తుండగా... కారులో వెళుతున్న వ్యక్తి రజనీకాంత్ ను గుర్తించి విష్ చేయగా, ఆయన ప్రతిగా అభివాదం చేయడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో రజనీ సింప్లిసిటీ మరోసారి చర్చనీయాంశమైంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News