Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త మోడల్‌ కారును శ్రీ‌వారికి విరాళంగా అందించిన మహేంద్ర కంపెనీ

ఆటోమొబైల్‌ రంగంలో పేరెన్నికగన్న మహేంద్ర కంపెనీ తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌రుడికి ఈరోజు ఉద‌యం కారుని విరాళంగా అందించింది. తమ కంపెనీ నూత‌నంగా రూపొందించిన కొత్త‌మోడ‌ల్ కారును ఈరోజు తిరుమ‌లకు తీసుకువ‌చ్చిన ఆ కంపెనీ ప్ర‌తినిధులు ఆ కారుకి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ త‌రువాత టీటీడీ డిప్యూటీ ఈవో కోదండరామారావుకు ఆ కారుని అందించి, దానికి సంబంధించిన ప‌త్రాల‌ను ఇచ్చారు. కారుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ అవ‌స‌రాల కోసం ఉప‌యోగించ‌నున్నారు.

More Telugu News