అమరావతిపై ఎన్జీటీలో మరో పిటిషన్!... విచారణకు స్వీకరించిన ట్రైబ్యూనల్!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ (ఎన్జీటీ)లో మరో పిటిషన్ దాఖలైంది. రాజధాని పరిధిలో గ్రీన్ కారిడార్ తగ్గిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలో దాఖలైన రెండు పిటిషన్లను ట్రైబ్యూనల్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాదాపుగా ఇవే ఆరోపణలతో పండలనేని శ్రీమన్నారాయణ అనే వ్యక్తి ట్రైబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కూడా విచారణకు స్వీకరించిన ట్రైబ్యూనల్ వచ్చే నెల 10న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.