Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

10 రూపాయల నాణేలు చెల్లడం లేదంటూ బ్యాంకుల ముందు క్యూ... దుష్ప్రచారం అంటున్న బ్యాంకు అధికారులు

సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో తెలిపే ఘటన ఫరీదాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పది రూపాయల నాణేలు చెల్లవని, ఈ మేరకు ఆర్బీఐ ప్రకటన విడుదల చేసిందటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. దీనిని నిజమని నమ్మిన ఫరీదాబాద్ వాసులు గత రెండు వారాలుగా లావాదేవీలలో 10 రూపాయల నాణేలు తీసుకోవడం లేదు. ప్రధానంగా టియాగాన్, పాత ఫరీదాబాద్ లలోని కొన్ని వ్యాపార సంస్థలు 10 రూపాయల నాణేలను తిరస్కరిస్తున్నాయి. దీంతో వీటిని తీసుకుని ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. ఆ నాణేలను బ్యాంకులో జమ చేసి పది రూపాయల నోట్లు తీసుకుంటున్నారు. దీనిపై నీలమ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని, 10 రూపాయల నాణేలను నిషేధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అటువంటప్పుడు 10 రూపాయల నాణేలను తిరస్కరించే వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని తెలిపారు. నిషేధం భయంతో ప్రజలు సుమారు 2 వేల పది రూపాయిల నాణేలు బ్యాంకులో జమచేసినట్టు ఆమె తెలిపారు.

More Telugu News