ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి ప్రకటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి ప్రకటన

పోలీసు శాఖ‌లో ఉద్యోగాలు ఆశిస్తోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. భారీ సంఖ్య‌లో పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈరోజు విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో డీజీపీ జేవీ రాముడు 4,548 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్ర‌క‌టించారు. 3,216 సివిల్‌ కానిస్టేబుల్‌, 1,067 ఆర్మ్‌డ్‌ రిజర్వుడు కానిస్టేబుల్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇక‌ జైళ్లలో 240 పురుష వార్డర్‌, 25 మహిళా వార్డర్‌ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో మ‌హిళా అభ్య‌ర్థుల‌కు మూడో వంతు రిజర్వేష‌న్ కేటాయించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్ ను రూపొందించామ‌ని, పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన వివ‌రాలు, ద‌ర‌ఖాస్తులు దాని నుంచే పొంద‌వ‌చ్చ‌ని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ 16న పోలీసు ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News