భూములు లాక్కొని రైతులను రోడ్డున పడేస్తున్నారు: బొత్స ఆగ్రహం
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. భూములు లాక్కొని రైతులను రోడ్డున పడేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యాలయాల కోసం విలువైన భూములు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హామీల్లో చెప్పినట్లు ఒక్క ఇల్లు కూడా పేదలకు నిర్మించి ఇవ్వలేదని ఆయన అన్నారు. చంద్రబాబు చర్యలను వ్యతిరేకిస్తూ, ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుందని చెప్పారు.