Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లావణ్య త్రిపాఠి కబుర్లు బాగా చెబుతుంది: యువహీరో అల్లు శిరీష్

హీరోయిన్ లావణ్య త్రిపాఠి కబుర్లు బాగా చెబుతుందని యువహీరో అల్లు శిరీష్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్లిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’ గురించి ఆయన ప్రస్తావించాడు. షాట్ రెడీ అని చెప్పినా కూడా లావణ్య మాట్లాడుతూనే ఉంటుందని చెప్పాడు. ఈ చిత్రంలో తమ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో, రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటుందన్నాడు. ఎప్పుడూ తనని ఏడిపిస్తుంటానని, తను కూడా ఏదో ఒక కౌంటరిస్తూ ఉంటుందని, లావణ్య త్రిపాఠికి ‘వెరీ గుడ్ సెన్సాఫ్ హ్యుమర్’ ఉందని, ఆమెతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని శిరీష్ చెప్పాడు.

More Telugu News