Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుష్కర పనులు జరుగుతోన్న తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్క‌ర ప‌నులు స‌కాలంలో పూర్తి చేయ‌ని గుత్తేదారు తీరుపై ఈరోజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణా జిల్లా సీతానగరంలో పుష్కర పనులను ప‌లువురు అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించిన ఆయ‌న.. ప‌నులు జ‌రుగుతోన్న తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈరోజు సాయంత్రం అధికారులు, కాంట్రాక్ట‌ర్ల‌తో ఆయ‌న చ‌ర్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. పుష్క‌రాల‌కు మ‌రో 20 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంద‌ని, అయినా ఇంకా ప‌నులు మంద‌కొడిగా జ‌రుగుతున్నాయ‌ని చంద్రబాబు అన్నారు. పనులు నిర్ణయించిన కాల వ్యవధిలోపు పూర్తి కాకపోవడంపై స‌మాధానం ఇవ్వాల‌ని ఆయ‌న చెప్పారు. అవసరమైతే సీతానగరంలో నియ‌మించిన‌ గుత్తేదారును తప్పించి, ఆ స్థానంలో పుష్క‌ర‌ప‌నుల బాధ్య‌త మరొకరికి అప్పగించాలని ఆయ‌న అధికారులను ఆదేశించారు.

More Telugu News