నేనేమైనా బకరా మంత్రినా?: ప్రిన్సిపాల్ పై మంత్రి హరీశ్ రావు నిప్పులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేనేమైనా బకరా మంత్రినా?: ప్రిన్సిపాల్ పై మంత్రి హరీశ్ రావు నిప్పులు

హరితహారం కార్యక్రమానికి తనను ఆహ్వానించి సరైన ఏర్పాట్లు చేయని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిర్గాపూర్ లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, రాపర్తికి వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో నల్లవాగు గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్ మెవాబాయి, విద్యార్థులు మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి, తమ పాఠశాల హరితహారంలో పాల్గొనాలని, మొక్కలు నాటాలని కోరారు. అందుకు అంగీకరించిన హరీశ్, స్కూల్ లోనికి వెళ్లగా, అక్కడ కనీసం పార, పలుగు కాదుకదా... చుక్క నీరు కూడా అందుబాటులో లేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో మండిపడిన హరీశ్, 'నేనేమైనా బకరా మంత్రిని అనుకుంటున్నావా? ఇవేనా ఏర్పాట్లు? నన్ను సరదాకి పిలుద్దామని రోడ్డెక్కారా?' అంటూ మండిపడ్డారు. దీంతో మెవాబాయి కొంత మనస్తాపంతో, తప్పు జరిగిందని చెబుతూ, మొక్కలు నాటాలని కోరడంతో, హరీశ్ స్వయంగా గుంత తీసి మొక్కను నాటారు.

More Telugu News