దేవుళ్లకి ఆశ్చర్యం కలిగితే ‘ఓ మై రజనీకాంత్!’అంటారు: రజనీపై ట్వీట్ల వీరాభిమానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేవుళ్లకి ఆశ్చర్యం కలిగితే ‘ఓ మై రజనీకాంత్!’అంటారు: రజనీపై ట్వీట్ల వీరాభిమానం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై అభిమానుల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజవుతోందంటే వారి ఆనందానికి పట్టపగ్గాలుండవు. అదే ఉత్సాహాన్ని రజనీ అభిమానులు ఇప్పుడు చూపిస్తున్నారు. ఎల్లుండి విడుదల కానున్న ‘కబాలి’ చిత్రంపై రజనీ అభిమానులే కాదు, సినీ వర్గాలు కూడా భారీ అంచనాలతో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన ‘కబాలి’ సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్న అభిమానుల ప్రేమకు వారి ట్వీట్లే నిదర్శనంగా చెప్పవచ్చు. ఆ ట్వీట్లలో ఒకటి...‘మనకు ఆశ్చర్యం కలిగితే ఓ మై గాడ్ (ఓఎంజీ) అంటాం. అదే దేవుళ్ళకు ఆశ్చర్యం కలిగితే ‘ఓ మై రజనీకాంత్’ అంటారు. ‘కబాలి’ సినిమా దేవుళ్లు కనుక చూస్తే 'ఓఎంఆర్! (ఓ మై రజనీ) అంటారు’ అని ఒక వీరాభిమాని రజనీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

More Telugu News