Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ రాష్ట్ర చేప 'కొరమీను'

తెలంగాణ రాష్ట్ర చేపగా కొరమీనును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రాష్ట్రానికి సంబంధించిన పక్షి, జంతువులు, ఆటలు, చెట్లు, పూలు తదితరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సందర్భంగా జలచరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో తాజాగా కొరమీనును తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, తెలంగాణ రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు, తెలంగాణ రాష్ట్ర పండుగా మామిడి పండు, తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, తెలంగాణ రాష్ట్ర క్రీడగా కబడ్డీ, తెలంగాణ రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు కొరమీను వచ్చి చేరింది.

More Telugu News