Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయి: మోదీ ఆశాభావం

ఈరోజు ప్రారంభ‌మ‌యిన పార్లమెంట్ వ‌ర్షాకాల‌ సమావేశాలు సజావుగా సాగుతాయని ప్ర‌ధాని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈరోజు పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. స‌భ స‌జావుగా కొన‌సాగ‌డానికి స‌హ‌క‌రించేందుకు అన్ని పార్టీలు అంగీక‌రించాయ‌ని ఆయన పేర్కొన్నారు. ఈ ఆగ‌స్టు 15న దేశం 70వ స్వాతంత్ర్య దినోత్స‌వం జ‌రుపుకోనుందని, ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్‌లో ఉన్న‌తమైన నిర్ణ‌యాలు తీసుకోబోతున్నామ‌ని, 70 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తావ‌ని మ‌రింత ఉన్న‌త దిశ‌గా న‌డ‌వాల‌ని ఆయ‌న అన్నారు. దేశం వేగంగా ముందుకు సాగాలని, అందుకోసం పార్లమెంట్ సభ్యులు అంద‌రూ క‌లిసి స‌భ‌లో దిశానిర్దేశం చేయాలని మోదీ వ్యాఖ్యానించారు. స‌భ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల‌తో విడివిడిగా చ‌ర్చించామ‌ని, స‌మావేశాల్లో దేశాభివృద్ధి కోసం మంచి నిర్ణ‌యాలు తీసుకోనున్నామ‌ని మోదీ పేర్కొన్నారు.

More Telugu News