చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం... మృత్యువుతో పోరాడిన తాతయ్య కూడా మృతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం... మృత్యువుతో పోరాడిన తాతయ్య కూడా మృతి!

కన్నూమిన్నూ కానక, ఐదుగురు తాగుబోతులు చేసిన పనికి ఛిన్నాభిన్నమైన చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 1వ తేదీన పంజాగుట్ట సమీపంలో పూటుగా తాగి అతి వేగంతో కారు నడుపుకుంటూ వస్తున్న బీటెక్ విద్యార్థి వీరిని యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చిన్నారి రమ్య బాబాయి రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, వారం రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన రమ్య కేర్ ఆసుపత్రిలో మరణించింది. ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఆమె తాతయ్య మధుసూదనాచారి 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించారు. మూడు వారాల వ్యవధిలో ఒకే ఇంట ఇది మూడో మరణం. ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రమ్య తల్లి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్న సంగతి విదితమే.

More Telugu News