'ఈ సోది అంతా ఎందుకు? అసలు విషయం చెప్పు' అన్న అభిమాని ప్రశ్నకు హీరోయిన్ సమంత జవాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఈ సోది అంతా ఎందుకు? అసలు విషయం చెప్పు' అన్న అభిమాని ప్రశ్నకు హీరోయిన్ సమంత జవాబు!

తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా నిత్యమూ అభిమానులకు అందుబాటులో ఉండే అందాల తార సమంత, ట్విట్టర్ వేదికగా, తన వివాహంపై వస్తున్న వార్తల నుంచి హనీమూన్ వరకూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. వీటిల్లో కొన్ని చిలిపి, మరికొన్ని సంచలన జవాబులు ఉన్నాయి. తనతో చాటింగ్ చేయాలని సమంత కోరగా, వేలాది మంది అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. చిలిపి ప్రశ్నలు వేస్తున్న అభిమానులను డార్లింగ్ అని సంబోధిస్తూ, సమంత పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. సెప్టెంబర్ 23న మీ వివాహం ముహూర్తమటగా? అన్న ప్రశ్నకు, 'ఆ విషయం ఎవరూ చెప్పలేదుగా' అని అంది. కొన్ని వెబ్ సైట్లలో హనీమూన్ తేదీలు, ఎక్కడికి వెళ్లనున్నారన్న విషయాలపై రూమర్స్ వస్తున్నాయని చెప్పగా, ఓ నమస్కారం పెడుతూ సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది. పెళ్లి ఎవరెవరికి జరుగుతుందో చూడాలని ఉందని ఓ అభిమాని చెప్పగా, తన కోరిక కూడా అదేనని అంది. మీ పెళ్లికి పార్క్ హయత్ హోటల్ ను ఎంచుకున్నారటగా? అన్న ప్రశ్నకు... 'ఆ హోటలా? వావ్... దీనిపై అందరూ చర్చించండి' అని చమత్కరించింది. మరో అభిమాని, 'ఈ సోది అంతా ఎందుకు డార్లింగ్... ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుందిగా' అంటే, 'అసలు ఏదో ఒకటి ఉండాలిగా డార్లింగ్' అని తనదైన శైలిలో చెప్పుకుంది. ఎందుకు కొత్త సినిమాలు అంగీకరించడం లేదన్న ప్రశకు, తన తదుపరి చిత్రం 'తేరి', 'అఆ'ల కన్నా స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చిందీ ముద్దు గుమ్మ.

More Telugu News