Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ మోడల్ ఖాందిల్ బాలోచ్ హత్య... తుపాకీతో కాల్చి చంపిన సోదరుడు?

పాకిస్థాన్ వివాదాస్పద మోడల్ ఖాందిల్ బాలోచ్ దారుణ హత్యకు గురైంది. తోడబుట్టిన సోదరుడే ఆమెను హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాక్ ఇస్లామిక్ కుటుంబానికి చెందిన బాలోచ్ ఫేస్ బుక్, ట్విట్టర్లలో పలు అభ్యంతకర పోస్టులతో సంచలన మోడల్ గా పేరుపొందింది. పాశ్చాత్య సంస్కృతిని వ్యతిరేకించే వారిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన ఆమె ఒక సందర్భంలో ఆ దేశ అధ్యక్షుడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది. దీనికి 70 వేల హిట్స్ వచ్చాయట. బాలోచ్ వ్యవహార సరళిపై మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్న ఆమె సోదరుడు పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. ఈ క్రమంలో తన మాట వినడం లేదన్న కారణంగానే ఆమెను అతడు తుపాకీతో కాల్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

More Telugu News