Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ పసికందు మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్... పోలీసులపై పరువు నష్టం దావా వేస్తా నంటున్న మరో మహిళ!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మాయమైన బిడ్డ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. 'మాయమైన బేబీతో మహిళ' అంటూ విజయవాడ పోలీసులు ఓ ఫోటోను పోస్టర్లుగా వేసి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో అతికించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ముద్రించిన పోస్టర్లలో మహిళ ఓ టీవీ ఛానెల్ ను ఆశ్రయించారు. పోలీసులు విడుదల చేసిన పోస్టర్లలో తన ఫోటో ముద్రించారని, తాను నిందితురాలిని కాదని చెప్పారు. తన బిడ్డ ఐదు నెలల బిడ్డ అని, ఫిబ్రవరి 24న గుంటూరులో హెల్ప్ ఆసుపత్రిలో జన్మనిచ్చానని ఆమె చెప్పారు. ఈ బిడ్డ తనదేనని నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్షలకైనా సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా పోస్టర్లు విడుదల చేసిన పోలీసులపై పరువు నష్టం దావా వేసేందుకు కూడా సిద్ధమని ఆమె ఆవేశంగా అంది.

More Telugu News