జగన్ పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు: డొక్కా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు: డొక్కా

వైఎస్సార్సీపీ అధినేత జగన్ పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టు విజయవంతం కావడాన్ని జగన్ ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఓదార్పు యాత్రలకు జగన్ ఇప్పటికైనా స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు. ప్రజా సాధికార సర్వే ద్వారా నమోదయ్యే వివరాలతో కోటి మందికి లబ్ధి చేకూరనుందని ఆయన చెప్పారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ప్రజల్లో అపోహలు కల్పించి, ప్రజలను సర్వేలో పాల్గొనకుండా చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

More Telugu News