పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ బస్సును ఢీ కొన్న వ్యాన్.. 10 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ బస్సును ఢీ కొన్న వ్యాన్.. 10 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరం

ఓ స్కూల్ బ‌స్సుని వ్యాన్ ఢీకొట్ట‌డంతో 17 మంది విద్యార్థుల‌కు గాయాల‌యిన ఘ‌ట‌న‌ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలిపుర్దౌర్ ప్రాంతంలో ఈరోజు చోటుచేసుకుంది. తీవ్ర‌గాయాల‌పాల‌యిన విద్యార్థుల్లో 10 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఎదురుగా వేగంగా వచ్చిన వ్యానే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు గాయాలైన విద్యార్థుల‌ను అక్క‌డి ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స్కూల్ బ‌స్సుని ఢీ కొట్టిన‌ వ్యాన్ డ్రైవర్ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అక్క‌డి నుంచి పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News