హరీశ్‌రావుపై మండిపడ్డ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుపై రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు హరీశ్‌రావు అన్యాయం చేస్తున్నారని అన్నారు. రైతులకు సక్రమంగా పరిహారం అందడానికి అనువుగా వున్న '2013 భూసేకరణ చట్టాన్ని' ఉల్లంఘించే విధంగా హరీశ్‌రావు తీరు ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టులు కట్టాలనే ఉద్దేశం ఉంటే ముందు భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని ఆయన అన్నారు.