నల్లధనాన్ని దాచుకున్న వారికి మరింత వెసులుబాటు... వాయిదా పధ్ధతిలో చెల్లింపులు
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా నల్లధనాన్ని దాచుకున్న వారికి మోదీ సర్కారు మరో శుభవార్తను చెప్పింది. దాచుకున్న నల్లధనం వివరాలను వెల్లడించి జరిమానా కట్టి, దాన్ని వైట్ గా మార్చుకోవచ్చని ఇప్పటికే ప్రత్యేక స్కీమును అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు మరో వెసులుబాటును దగ్గర చేసింది. జరిమానాను, వడ్డీని వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చని తెలిపింది. వీటిని మూడు వాయిదాల్లో చెల్లించాలని పేర్కొంది. మొత్తం జరిమానా, వడ్డీ కలిపి నవంబర్, మార్చి నెలల్లో 25 శాతం చొప్పున, ఆపై వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లోగా మిగతా 50 శాతం చెల్లించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.