అమరనాథ్ యాత్రకు బయల్దేరిన 3,139 మంది యాత్రికులు
హిమాలయాల్లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం అమర్ నాథ్ యాత్రకు మరో బృందం బయల్దేరింది. జమ్మూకాశ్మీర్ లో హిజుబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజులపాటు అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. దీంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చిన భద్రతా దళాలు, సోమవారం నుంచి యాత్రను దశలవారీగా ప్రారంభించారు. ఈ క్రమంలో నేడు 3,139 మంది యాత్రికులతో కట్టుదిట్టమైన భద్రత మధ్య మరో బృందానికి అనుమతిచ్చినట్టు అధికారులు తెలిపారు.