పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా!: ఇమ్రాన్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా!: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ లోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి వ్యాఖ్యలపై మీడియా ప్రసారాలను ఖండించారు. ఈ మేరకు లండన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన మూడో వివాహంపై మీడియాలో ప్రసారమవుతున్న కథనాలన్నీ నిరాధారమని అన్నారు. ఒకవేళ తాను పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని ఆయన అన్నారు. అలా పెళ్లి చేసుకున్ననాడు అందరినీ పిలిచి పెద్ద వేడుక నిర్వహిస్తానని చెప్పారు. కాగా, పాకిస్థాన్‌ కు చెందిన ‘దునియా న్యూస్’ ఇమ్రాన్ ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్నట్టు వార్తాకథనం ప్రసారం చేసింది. ఇటీవల లండన్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వివాహం చేసుకున్నాడని పేర్కొంది. పంజాబ్ ప్రావిన్సులోని పాక్‌ పట్టన్ జిల్లాకు చెందిన మరియంను మూడో వివాహం చేసుకున్నట్టు దునియా న్యూస్ తెలిపింది. ఇమ్రాన్‌ ఖాన్‌ కు అధ్యాత్మిక గురువుగా వ్యవహరిస్తున్న బుష్రాకు మరియం సోదరి అని దునియా న్యూస్ వెల్లడించింది. గతంలో జరిగిన వివాహం ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లయిన ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని, ఇమ్రాన్ ఖాన్ ను వివాహం చేసుకుందని తెలిపింది.

More Telugu News