సోషల్ మీడియాను నవ్విస్తున్న పంజాబీ పెళ్లి కొడుకు
ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి ప్రధానమైన ఘట్టం. దీనిని గుర్తుంచుకునేందుకు వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే ఎవరి వివాహ ఘట్టం వారికి గుర్తుంటే, కొందరి వివాహాలు మాత్రం దానికి హాజరైన అందరికీ గుర్తుండిపోతాయి. ఓ పంజాబీ యువకుడి వివాహంలో జరిగిన గమ్మత్తైన సంఘటన ఆ వివాహానికి హాజరైన అందరికీ నవ్వు తెప్పించింది. పంజాబ్ కు చెందిన జంట వివాహానంతరం పవిత్ర గ్రంధం చుట్టూ ప్రదక్షిణలు (హోమగుండం చుట్టూ చేసే ప్రదక్షిణల తరహాలో) చేస్తోంది.
ఈ ప్రదక్షిణ సమయంలో వరుడి ప్యాంటు జారిపోవడం ప్రారంభించింది. దీంతో ఒకచేత్తో ప్యాంటు, రెండో చేత్తో భుజాన ఉన్న కండువాను పట్టుకుని నడవడం ప్రారంభించాడు. అయితే ప్యాంటు కదలనివ్వకపోవడంతో పైకి నవ్వుతూ నెమ్మదిగా అడుగులో అడుగేశాడు. దీంతో కళ్యాణ మండపంలోని వారంతా పెద్దగా నవ్వడం ప్రారంభించారు. దీనిని గమనించిన అతని బంధువు వచ్చి ప్యాంటును పైకి లాగి గట్టిగా కట్టేందుకు సహాయపడ్డారు. ఈ సన్నివేశాన్ని వీడియో తీసిన అతని బంధువులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇది వైరల్ అయింది. దీనిని వీక్షించిన వారంతా నవ్వుకుంటున్నారు.