Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయాల్లోకి ప్రవేశించినున్న పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ

తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఓ ప్రకటన చేశాడు. వీలైనంత త్వరగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పాడు. అయితే ఓ పార్టీ పెడతాడా? లేక ఇప్పటికే ఉన్న పార్టీలో చేరతాడా? అన్న విషయం స్పష్టం చేయలేదు. బీబీసీ ఉర్దూ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా అప్రిదీ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గమని అన్నాడు. సేవ చేసేందుకు తన పౌండేషన్ సరిపోతుందని, ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే సేవలందిస్తున్నానని, అయితే ఎక్కువ సంఖ్యలో ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని చెప్పాడు. అయితే, తన సన్నిహితులంతా రాజకీయాల్లోకి వెళ్లవద్దని తనను వారిస్తున్నారని అన్నాడు. భవిష్యత్ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని అఫ్రిదీ తెలిపాడు.

More Telugu News