'మేము సైతం' కోసం... ఎంజీబీఎస్ లో మూటలు మోసిన మంచు మనోజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మేము సైతం' కోసం... ఎంజీబీఎస్ లో మూటలు మోసిన మంచు మనోజ్

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కూలీ అవతారమెత్తాడు. తన సోదరి నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమంలో భాగమయ్యేందుకు మనోజ్ కూలీగా మారాడు. ఆర్థికంగా ఓ కుటుంబాన్ని ఆదుకునేందుకు మనోజ్ హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లో కూలీగా పని చేశాడు. ఈ సందర్భంగా మూటలు మోశాడు. మనోజ్ ను కూలీగా చూసిన అభిమానులు తొలుత ఆశ్చర్యానికి గురైనా, తరువాత అతని సదుద్దేశాన్ని గమనించి, అతనికి సహకరించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. సుమారు నాలుగు గంటలపాటు మనోజ్ ఇలా వివిధ పనులు చేయడం విశేషం.

More Telugu News