సెల్ఫీలంటే నాకిష్టముండదు: హీరో ‘అల్లరి’ నరేష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెల్ఫీలంటే నాకిష్టముండదు: హీరో ‘అల్లరి’ నరేష్

సెల్ఫీలంటే తనకు ఇష్టముండదని హీరో అల్లరి నరేష్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఫ్యాన్స్ వచ్చి అడిగితే సెల్ఫీకి సరే అంటాను తప్ప, తనంతట తానుగా సెల్ఫీలు దిగనని చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో కూడా తన సెల్ఫీ పోస్టింగ్ లు కూడా ఎక్కువగా పెట్టనని చెప్పాడు. సెల్ఫీ దిగడం అంటే ఏదోగా అనిపిస్తుందన్నాడు. ‘మా ఫ్రెండ్స్ అందరిలోకి నేనే ఎక్కువ ఎత్తుగా ఉంటాను. ఒరేయ్, నీ చేతులు పొడుగ్గా ఉంటాయిరా, నువ్వే తీయరా సెల్ఫీ అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. సెల్ఫీ స్టిక్ అనుకున్నారా లేక చేతులనుకున్నారా? అని నేనంటూ ఉంటాను’ అని నరేష్ చెప్పాడు. కాగా, నరేష్ నటించిన తాజా చిత్రం ‘సెల్ఫీ రాజా’ ఈ నెలలో విడుదల కానుంది.

More Telugu News