Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 251కి స్మార్ట్ ఫోన్ ఇచ్చేందుకు ఎంతో నష్టపోయాం: మోహిత్ గోయల్

కేవలం రూ. 251కి స్మార్ట్ ఫోన్ ను అందించేందుకు తామెంతో నష్టపోయామని రింగింగ్ బెల్స్ చీఫ్ మోహిత్ కుమార్ గోయల్ వ్యాఖ్యానించారు. నేటి నుంచి ఫోన్ల డెలివరీని ప్రారంభించినట్టు తెలిపారు. తమ వద్ద మొత్తం 2 లక్షల యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని, వీటిని డెలివరీ చేస్తే రూ. 23 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించాల్సి వుందని తెలిపారు. తానెన్నడూ లాభాలను ఆర్జించలేదని, తన సంస్థలో 33 శాతం వాటాలను విక్రయించిన తరువాతనే ఫ్రీడమ్ 251 ఫోన్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయగలిగామని తెలిపారు. హరిద్వార్ లో థర్డ్ పార్టీ మాన్యుఫాక్చరర్ గా సచ్చిదానంద్ ఎంటర్ ప్రైజస్ ను ప్రారంభించి, ఫోన్ల తయారీ చేపట్టినట్టు తెలిపారు. కాగా, నేడు 5 వేల యూనిట్ల ఫోన్లను డెలివరీ చేస్తున్నట్టు ఇప్పటికే మోహిత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, మార్కెట్ నిపుణుల లెక్కల ప్రకారం, ఫ్రీడమ్ 251కు వాడిన పరికరాల ఖరీదు రూ. 1,180 రూపాయలు. ఈ లెక్కన రూ. 251కి ఫోన్ ఇవ్వడం వల్ల ఒక్కో ఫోన్ పై దాదాపు రూ. 920 నష్టాన్ని సంస్థ భరిస్తోందట.

More Telugu News