'జమాత్' వెబ్ సైట్ లో ఐఆర్ఎఫ్ పేరు!.. జకీర్ నాయక్ కు ‘ఉగ్ర’ లింకుల నిర్ధారణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జమాత్' వెబ్ సైట్ లో ఐఆర్ఎఫ్ పేరు!.. జకీర్ నాయక్ కు ‘ఉగ్ర’ లింకుల నిర్ధారణ!

‘పీస్ టీవీ’ పేరిట ఇస్లామిక్ ప్రసంగాలు చేస్తున్న వివాదాస్పద మత గురువు, ‘ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ (ఐఆర్ఆఫ్)’ వ్యవస్థాపకుడు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని తేలిపోయింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలి ఆర్టిసార్ బేకరిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదుల్లో ఇద్దరు జకీర్ ప్రసంగాల కారణంగానే ప్రభావితమయ్యారన్న వార్తల నేపథ్యంలో ఆయన పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే తానెప్పుడూ ఉగ్రవాదానికి మద్దతివ్వలేదని జకీర్ బాహాటంగా ప్రకటించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఆయనకు ఉగ్రవాదులతో లింకులున్నాయని నిర్ధారించేసింది. 2008లో ముంబైలో జరిగిన మారణహోమానికి పాకిస్థాన్ భూభాగం మీద నుంచే సూత్రధారిగా పనిచేసిన హఫీజ్ సయీద్ నేతృత్వం వహిస్తున్న జమాత్ ఉద్ దవా సంస్థ వెబ్ సైట్ లో ఐఆర్ఎఫ్ పేరు ఉంది. దీంతో జకీర్ 'జమాత్' ఉగ్రవాదులకు తన బోధనలు వినిపిస్తున్నారన్నట్లు తేలిపోయింది. దక్షిణాసియాలో ఇస్లామిక్ బోధనలు వినిపించే ఒకే ఒక్క టీవీ ‘పీస్ టీవీ’ పేరు జమాత్ వెబ్ సైట్ లో కనిపించడంతో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులకు జకీర్ పాఠాలు చెబుతున్నారని తేలిపోయింది. ఫలితంగా నిన్నటిదాకా సేఫ్ గానే ఉన్న జకీర్... భవిష్యత్తులో గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదేమో!

More Telugu News