Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య కోసం ఐదేళ్లు వెతికిన భర్తకు పెద్ద షాక్!

భార్య మరణించిందని చెబుతున్నా వినకుండా, ఐదేళ్ల పాటు ఆమె కోసం వెతుకుతూ శ్రమ పడ్డ ఓ వ్యక్తికి షాక్ ఎదురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బీహార్ ముజఫర్ ప్రాంతానికి చెందిన హతీమ్ అన్సారీ అనే వ్యక్తికి అమానా అనే యువతితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆపై కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా మాయం అయింది. తన భార్య అదృశ్యమైందని అన్సారీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అమానా తల్లిదండ్రులు, తమ అల్లుడే ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేశాడని కేసు పెడితే, పోలీసులు అరెస్ట్ చేయగా, కొంత కాలం జైల్లో కూడా గడిపాడు. బెయిలుపై తిరిగి బయటకు వచ్చిన తరువాత ప్రేమను చంపుకోలేక అలుపెరగక వెతుకుతూనే ఉన్నాడు. ఇటీవల ఆమె ఫరూఖాబాద్ లో కనిపించిందని బంధువులు ఎవరో చెప్పడంతో పోలీసులకు విషయం చెప్పి, వారిని తీసుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడ కాజల్ గా పేరు మార్చుకుని వేరే వ్యక్తితో కలసి కాపురం చేస్తున్న అమానను చూసి షాక్ తిన్నాడు. అన్సారీతో కాపురం ఇష్టం లేకనే తాను వదిలేసి వెళ్లినట్టు ఆమె పోలీసులకు స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక వెనుదిరిగాడు.

More Telugu News