పోచారం రాజీనామా చేయాలి: షబ్బీర్ అలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోచారం రాజీనామా చేయాలి: షబ్బీర్ అలీ

బ్యాంకర్లు, విత్తన కంపెనీలు తన మాట వినడం లేదన్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. 19 లక్షల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానిది ప్రచారార్భాటమని మండిపడ్డ ఆయన, ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

More Telugu News