రైతులకు శుభవార్త...ఎరువుల ధరలు తగ్గించిన కేంద్రం
ఖరీఫ్ సీజన్ వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నల గుండెల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే వ్యవసాయ ఖర్చులు తలచుకుని ఆందోళనలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎరువుల ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ, రైతును, భూమిని సంరక్షించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎరువుల ధరలను తగ్గిస్తున్నామని చెప్పారు. టన్ను డీఏపీపై 2500 రూపాయలు తగ్గించగా 50 కేజీల బస్తాపై 125 రూపాయలు తగ్గినట్టు, టన్ను ఎంవోపీపై 5 వేల రూపాయలు తగ్గించగా 50 కేజీల బస్తాకు 250 రూపాయలు తగ్గించినట్టు, ఎన్ పీకే కాంప్లెక్స్ ఎరువుపై వెయ్యి రూపాయలు తగ్గించగా, 50 కేజీల బస్తాకు 50 రూపాయలు తగ్గుతుందని తెలిపారు. ఇది రైతులకు ఆనందం కలిగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.