‘ఆరోగ్యశ్రీ’ ప్యాకేజీ 20 శాతం పెంచాలి: కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ఐకాస
‘ఆరోగ్యశ్రీ’ ప్యాకేజీ 20 శాతం పెంచాలని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ఐకాస డిమాండ్ చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్ లో కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ఐకాస ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఐకాస చర్చలు జరిపింది. ఆరోగ్యశ్రీ పూర్తి బకాయిలు చెల్లించే వరకు సమ్మె యథాతథంగా నడుస్తుందని, మంగళవారం వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని ఐకాస నేతలు తెలిపారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ప్యాకేజీ 20 శాతం పెంచాలని పేర్కొన్నారు. మంగళవారం నాడు మంత్రి లక్ష్మారెడ్డితో మరోసారి సమావేశం కానున్నట్లు చెప్పారు.