Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హాలీవుడ్ దర్శకుడు మైఖేల్ సిమినో కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మైఖేల్ సిమినో (77) కన్నుమూశారు. లాస్ ఏంజిల్స్ లోని ఆయన స్వగృహంలో నిన్న మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, రైటర్ కావాలనే ఆలోచనతో 1970ల్లో ఆయన హాలీవుడ్ లోకి ప్రవేశించారు. మొత్తం 8 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 1978లో నిర్మించిన ‘ది డీర్ హంటర్’ చిత్రానికి గాను రెండు ఆస్కార్ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.

More Telugu News