బైక్ రేసులను అడ్డుకుంటారా? మా నాన్నెవరో తెలుసా?: పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువకులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బైక్ రేసులను అడ్డుకుంటారా? మా నాన్నెవరో తెలుసా?: పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువకులు

బైక్ రేసింగ్ లను అడ్డుకున్న పోలీసులపై ఆ యువకులు చిందులు తొక్కారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి అంతు చూస్తామన్నారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి తరువాత హైదరాబాదు, జూబ్లీహిల్స్ వద్ద జరిగింది. చెక్ పోస్టు సమీపంలో బైక్ పై వేగంతో దూసుకువస్తున్న వారిని పోలీసులు ఆపారు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన యువకులు వాదనకు దిగారు. బైక్ రేసులను అడ్డుకుంటారా? మా నాన్నెవరో తెలుసా? అంటూ దుర్భాషలాడారు. అదనపు పోలీసు బలగాల సాయంతో మొత్తం 16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 16 బైకులు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ రాత్రంతా స్టేషనులో ఉంచి, ఉదయాన్నే వారి తల్లిదండ్రులను పిలిపించారు. ప్రస్తుతం తల్లిదండ్రుల సమక్షంలో వీరికి కౌన్సెలింగ్ జరుగుతోంది. తొలిసారిగా దొరికిన వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తామని, గతంలోనే కౌన్సెలింగ్ పూర్తయిన వారిపై కేసులు పెట్టనున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News