Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్నారు.. ప్ర‌జ‌ల‌ను మోసం చేయొద్దు: మ‌ంత్రి తుమ్మ‌ల

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న నేప‌థ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స్పందించారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాలు ప్రాజెక్టుల‌పై అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తూ వాటిని అడ్డుకోవ‌డం స‌రికాద‌ని అన్నారు. బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న నేతలు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేయొద్ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం త‌మ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో రూపొందిన‌ డిజైన్ల కంటే మంచి న‌మూనాలు త‌మ వ‌ద్ద‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీసుకుని వ‌స్తే వాటినే స్వీక‌రిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ప్ర‌జ‌ల కష్టాల‌ను తీర్చడం కోస‌మేన‌ని, భ‌క్త‌రామ‌దాసు ప్రాజెక్టుతో ఈ ఏడాది నుంచే సాగునీరు అంద‌నుందని తుమ్మల పేర్కొన్నారు. క‌ర‌వు ప్రాంత‌మ‌యిన పాలేరుకు నీరు అందించ‌నున్నామ‌ని ఆయ‌న అన్నారు. మిష‌న్ కాక‌తీయ మంచి ఫ‌లితాలనిస్తోంద‌ని, మొద‌టి, రెండో ఫేజ్‌లో ఖ‌మ్మం మొద‌టి స్థానం సాధించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News