తెలుగు రాష్ట్రాల్లో మూగబోయిన ఐడియా ఫోన్లు!... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాల్లో మూగబోయిన ఐడియా ఫోన్లు!... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు!

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోనే కాకుండా ఏకంగా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఐడియా సెల్ ఫోన్లు మూగబోయాయి. నేటి ఉదయం ఉన్నట్టుండి ఐడియా సెల్యూలార్ సర్వీసుకు చెందిన నెట్ వర్క్ కుప్పకూలింది. ఫలితంగా రెండు రాష్ట్రాల పరిధిలోని ఏ ఒక్క ఐడియా సెల్ కూడా మోగడం లేదు. ఇదేంటని చూసుకున్న వినియోగదారులు కస్టమర్ కేర్ సెంటర్లకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. కస్టమర్ కేర్ సెంటర్లకు చెందిన లైన్లు కూడా స్పందించడం మానేశాయి. దీంతో ఐడియా సర్వీసు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐడియా నెట్ వర్క్ కుప్పకూలడానికి కారణాలు తెలియరాలేదు. అయితే సేవల పునరుద్ధరణ కోసం యాజమాన్యం ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం.

More Telugu News