ఉగ్రవాదంపై ఉన్నతాధికారులతో 3 గంటల సమావేశం నిర్వహించిన ప్రధాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉగ్రవాదంపై ఉన్నతాధికారులతో 3 గంటల సమావేశం నిర్వహించిన ప్రధాని

హైదరాబాదులో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఉనికి బయటపడ్డవేళ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాదులో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టులు, బాంబుపేలుళ్లకు కుట్ర, ఆయుధ సామగ్రి లభ్యం కావడం వంటి సంచలన విషయాలు బయటపడ్డ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌, ప్రధాని భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఐబీ ఛీఫ్, ఇతర ఉన్నతాధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించి అధికారులు చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు. అలాగే భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికలను కూడా ప్రధానికి తెలిపినట్టు తెలుస్తోంది.

More Telugu News