గల్ఫ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గల్ఫ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

గల్ఫ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు గ్రామం దగ్గర 10 మంది అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, తమ బంధువులకు ఇవ్వాలంటూ విదేశాలకు వెళ్లే వారికి డ్రగ్స్ ప్యాకెట్లను వివిధ వస్తువుల్లో పెట్టి ఈ ముఠా పంపిస్తోందని చెప్పారు. డ్రగ్స్ తీసుకెళ్తున్న విషయం ఆ ప్రయాణికులకు తెలియకపోవడంతో తనిఖీల్లో పట్టుబడి శిక్షలు అనుభవిస్తున్నారని పోలీసులు చెప్పారు.

More Telugu News